నిఖిల్ ’18 పేజెస్’ కీలక షెడ్యూల్ మొదలు !

నిఖిల్ ’18 పేజెస్’ కీలక షెడ్యూల్ మొదలు !

Published on Jan 18, 2021 6:56 AM IST

టాలెంటెడ్ హీరో నిఖిల్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ ఉంటాడు. కాగా ప్రస్తుతం నిఖిల్ ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో వేసిన సెట్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని.. హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి.

అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయనుండగా గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేయనున్న ‘కార్తికేయ 2’ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు