భారీ ధర పలికిన ‘ముద్ర’ శాటిలైట్ హక్కులు !

Published on Jul 1, 2018 9:06 pm IST

యువ హీరో నిఖిల్ ఇటీవల కిర్రాక్ పార్టీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైయింది . ఈ సినిమా తరువాత ప్రస్తుతం ఆయన ‘ముద్ర’ అనే సినిమా లో నటిస్తున్నాడు. టి.ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా వస్తుంది . ఒరిజినల్ వెర్షన్ ని కూడా ఆయనే డైరెక్ట్ చేసాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈచిత్ర శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి . ప్రముఖ టీ వి ఛానల్ స్టార్ మా 5. 5 కోట్లు వెచ్చించి ఈ చిత్ర శాటిలైట్ హక్కులతో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :