టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన నిఖిల్ “స్పై”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన నిఖిల్ “స్పై”

Published on Nov 28, 2023 11:31 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గ్యారీ బీహెచ్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ స్పై. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మెన్స్ ను కనబరిచింది ఈ సినిమా. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

డిసెంబర్ 3, 2023 న ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు లో సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. ఐశ్వర్య మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో అభినవ్ గోమతం, జిశ్శు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు