నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Swayambhu

హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘స్వయంభు’(Swayambhu). ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రాబోతుంది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను 2026 ఏప్రిల్ 10న వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఐతే, గతంలో, ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 11న విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు, టీమ్ అదే రోజు హైదరాబాద్ మరియు ముంబైలో టీజర్ విడుదల కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్ మరియు శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

Exit mobile version