ఘనంగా ‘నిశ్శబ్ద ప్రేమ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఘనంగా ‘నిశ్శబ్ద ప్రేమ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Published on May 22, 2025 7:30 AM IST

Nishabda Prema

పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ నటించిన కొత్త సినిమా “నిశ్శబ్ద ప్రేమ”. ఈ చిత్రంలో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్.ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా ఈ నెల 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి రామారావు నిర్మాత రాజేశ్ పుత్ర, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ.. ‘”నిశ్శబ్ద ప్రేమ” చిత్రంతో మా పరిటాల రాంబాబు డిస్ట్రిబ్యూటర్ గా మారడం సంతోషంగా ఉంది. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా. హీరో శ్రీరామ్ మరో మంచి మూవీతో మన ముందుకు రాబోతున్నారు. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘”నిశ్శబ్ద ప్రేమ” సినిమా హీరో శ్రీరామ్ గారికి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆయన తెలుగులో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డిఫరెంట్ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. తమిళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ కావాలి. నిర్మాత కార్తికేయన్. ఎస్. ప్యాషనేట్ స. సరికొత్త థ్రిల్లర్ లవ్ స్టోరీగా “నిశ్శబ్ద ప్రేమ” సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 23న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.’ అని అన్నారు.

డైరెక్టర్ రాజ్ దేవ్ మాట్లాడుతూ.. ‘”నిశ్శబ్ద ప్రేమ” ట్రైలర్, సాంగ్ లాంఛ్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. “నిశ్శబ్ద ప్రేమ” సినిమా తమిళంలో మంచి ఆదరణ పొందింది. తెలుగులో ఈ నెల 23న రిలీజ్ కు వస్తోంది. తెలుగు ఆడియెన్స్ కూడా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం.’ అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక తిమ్మేష్ మాట్లాడుతూ.. ‘”నిశ్శబ్ద ప్రేమ” సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి, ప్రొడ్యూసర్ కార్తికేయన్, డైరెక్టర్ రాజ్ దేవ్ గారికి థ్యాంక్స్. ఈ నెల 23న మా “నిశ్శబ్ద ప్రేమ” సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మా మూవీని చూస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు