బర్త్ డే బాయ్ ఏమి అప్డేట్స్ ఇస్తాడో..?

Published on Mar 30, 2020 9:40 am IST

హీరో నితిన్ పుట్టిన రోజు నేడు. ఈ ఏడాది భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. మరి పుట్టిన రోజు పురస్కరించుకొని తన కొత్త చిత్రాల అప్డేట్స్ ఏమిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే మరో రెండు చిత్రాలలో నితిన్ నటిస్తున్నారు.

చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రంలో నితిన్ నటిస్తుండగా రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్నారు. అలాగే మరో యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక మూవీ చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా వచ్చే నెల 16న జరగాల్సిన ఆయన వాయిదావేసుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More