నితిన్ సినిమా అప్పటికి షిఫ్ట్ అయ్యిందా..?

నితిన్ సినిమా అప్పటికి షిఫ్ట్ అయ్యిందా..?

Published on Jan 7, 2021 7:03 AM IST

Nithiin

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లతో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్లాన్ చేసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “రంగ్ దే”. మంచి బజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఆలస్యన్ అయితే అయ్యింది కానీ అన్ని సినిమాల కన్నా ముందే లాక్ డౌన్ లో షూట్ ను స్టార్ట్ చేసుకుంది.

అప్పుడే ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలుపుతున్నామని ప్రకటన కూడా ఇచ్చేసారు. కానీ ఇప్పుడు సీన్ వేరేలా మారి వీరు ఈ రేస్ ను తప్పుకున్నారు. ఇక మరి మేకర్స్ ఈ చిత్రాన్ని వేసవి రేస్ కు షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓ మంచి టైం చూసుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందివ్వాలని మేకర్స్ అనుకుంటున్నారు.మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు