“రంగ్ దే”ని ప్రేమ‌తో చూసి హిట్టివ్వమంటున్న నితిన్‌.!

Published on Mar 20, 2021 1:59 pm IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఆల్రెడీ “చెక్”తో వచ్చి విఫలం అయ్యిన సంగతి తెల్సిందే. మరి దీని తర్వాత స్యూర్ షాట్ హిట్ కొట్టాలని తన లేటెస్ట్ చిత్రం రంగ్ దే తో రెడీ అయ్యాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా న‌టించిన ఈ ‘రంగ్ దే’ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ శుక్ర‌వారం రాత్రి క‌ర్నూలులో నితిన్ ఫ్యాన్స్‌, ప్రజల హర్షధ్వానాల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రిగింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘రంగ్ దే’ విడుద‌ల‌వుతోంది.

మరి ఈ ‘రంగ్ దే’ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో క‌ర్నూలుకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, ‘రంగ్ దే’ ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. క‌ర్నూలుకు త‌ర‌చూ వ‌చ్చి సినిమా షూటింగ్స్ చేయాల‌ని నితిన్‌ను కోరారు.కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ మాట్లాడుతూ, ‘రంగ్ దే’ సినిమా పెద్ద హిట్ట‌వ్వాల‌ని, నితిన్‌కు మంచి పేరు రావాల‌ని ఆకాంక్షించారు.

క‌ర్నూలు మునిసిప‌ల్ క‌మిష‌నర్ బాలాజీ మాట్లాడుతూ, తాను ఐఏఎస్‌కు ప్రిపేర‌య్యేట‌ప్పుడు కూడా ప్ర‌తి వారం ఓ సినిమా చూసేవాడిన‌ని తెలిపారు. దిల్ నుంచి నితిన్ సినిమాల‌న్నీ చూశాన‌ని చెప్పారు. ‘రంగ్ దే’ మూవీ హిట్ట‌వ్వాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఈ సినిమాని ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూస్తామ‌న్నారు.

డీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ, “నితిన్ మాకు క‌ర్నూలు బిడ్డ‌. ఆయ‌న బంధువులు మా కొలీగ్‌. ప్ర‌తి మూవీలో నితిన్‌ మ‌రింత యంగ్‌గా త‌యార‌వుతున్నారు. ‘రంగ్ దే’లో మ‌రింత యంగ్‌గా క‌నిపిస్తున్నారు. క‌ర్నూలులో షూటింగ్ చేసిన సినిమాల్లో 99 శాతం హిట్‌. ‘రంగ్ దే’ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా.” అన్నారు.

అలాగే ప్రముఖ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి మాట్లాడుతూ, “త‌క్కువ స‌మ‌యంలో పిలిచినా వ‌చ్చి ఇంత బాగా ఆద‌రించిన క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు థాంక్స్‌. 26న వ‌స్తున్న సినిమాని కూడా ఇలాగే ఆద‌రించి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నా.” అన్నారు.

ఇక యూత్ స్టార్ నితిన్ మాట్లాడుతూ, ట్రైల‌ర్‌ను లాంచ్ చేసిన హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్‌, భ‌ర‌త్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. “క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. ఆ ప్లేసెంత ప‌వ‌ర్‌ఫుల్లో మీరింకా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్ల‌కు వెళ్లాను. అక్క‌డ అంద‌రి ఎన‌ర్జీ చాలా బావుంట‌ది.

కానీ మీ ఎన‌ర్జీ దానికంటే ఓ లెవ‌ల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వ‌స్తోంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి.” అన్నారు.

ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ చిత్రం నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికెట్‌ అందుకున్న ‘రంగ్ దే’ సినిమా శుక్ర‌వారం సెన్సార్ ప‌నుల్ని పూర్తి చేసుకొని, యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌వ్విస్తూ, చ‌క్క‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింద‌ని సెన్సార్ స‌భ్యులు ఈ చిత్రాన్ని కొనియాడారు.

సంబంధిత సమాచారం :