నితిన్ “చెక్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ.!

Published on May 12, 2021 8:00 pm IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన రెండు ఈ సినిమాలు ఆల్రెడీ ఈ ఏడాది విడుదల కాబడిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా మంచి హైప్ తోనే వచ్చాయి. అయితే వాటిలో మొదటిది విలక్షణ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కించిన “చెక్”. ప్రియా ప్రకాష్ వారియర్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మిక్సిడ్ టాక్ తెచ్చుకుని చివరికి నష్టాల్లోనే ముగిసింది.

కానీ యేలేటి టేకింగ్ కోసం తెలిసిన వాళ్ళకి పర్వాలేదు అనిపించింది. మరి గత ఫిబ్రవరిలో విడుదల కాబడిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ గా విడుదలకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మే 14నే ఈ చిత్రం స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ లో మాత్రమే స్ట్రీమింగ్ కు రానుందట. ఇక ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :