ఈ దర్శకునితో నితిన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.?

Published on May 8, 2021 8:19 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది లో అప్పుడే వచ్చేసాయి. కానీ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. కానీ దర్శకుడు వెంకీ అట్లూరితో తీసిన “రంగ్ దే” పర్లేదు అనిపించింది. ఇక ఇదిలా వాటి రిజల్ట్ తో సంబంధం లేకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ నితిన్ ఇప్పుడు చేస్తున్నాడు. అవే “పవర్ పేట” మరియు “మాస్ట్రో”.

మరి ఈ రెండు చిత్రాలు కాకుండా మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానున్నట్టు తెలుస్తుంది. అదే ప్రముఖ రచయిత వక్కంతం వంశీతో అని టాక్. అయితే ఇప్పటికే వంశీ పలు హిట్ కథలు అందించారు. కానీ దర్శకునిగా తన ఫస్ట్ సినిమాతోనే వైఫల్యం చెందారు. మరి ఇప్పుడు ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :