సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యిన నితిన్ “మ్యాస్ట్రో”.!

Published on Jun 20, 2021 1:58 pm IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “మ్యాస్ట్రో” కూడా ఒకటి. బాలీవుడ్ హిట్ చిత్రం అంధధూన్ కి రీమేక్ గా తెరెకక్కిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “మ్యాస్ట్రో”. టీజర్ గ్లింప్స్ మరియు పోస్టర్స్ తో మంచి హైప్ ను సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా షూట్ జరిగి కొన్ని రోజులు కితమే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది.

అయితే లాక్ డౌన్ అనంతం స్టార్ట్ అయిన మొదటి చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. మరి ఈ చిత్రం ఎట్టకేలకు సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసేసారు. నితిన్ మరియు తమన్నాలపై కీలక సన్నివేశాలు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ని పూర్తి చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించారు. మరి ఈ
చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :