ఫైనల్ స్టేజ్ స్టార్ట్ చేసుకున్న నితిన్ థ్రిల్లర్ “మాస్ట్రో”

Published on Jun 14, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోస్ లో ఒకడైన యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో “మాస్ట్రో” కూడా ఒకటి. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ భారీ హిట్ చిత్రం అంధ ధూన్ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆల్రెడీ ఆల్ మోస్ట్ చాలా సినిమా పూర్తయ్యిపోయింది. అయితే మిగతా బ్యాలన్స్ షూట్ మళ్ళీ కరోనా తీవ్రత పెరిగిపోవడం మూలాన నిలిచింది.

కానీ ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ టాలీవుడ్ లో ఈ సెకండ్ వేవ్ అనంతరం స్టార్ట్ కాబడిన పెద్ద సినిమాగా నిలిచింది. జస్ట్ కొన్ని రోజులు ఫైనల్ షెడ్యూల్ బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. అయితే ఈ షూట్ లో నితిన్ మరియు తమన్నాలపై కీలక సన్నివేశాలను తీస్తున్నారట.

ఇక ఇది కాస్త అయ్యిపోతే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి. ఇది వరకే వచ్చిన టీజర్ గ్లింప్స్ మరియు పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :