నితిన్ దారిలో పడ్డట్టే

Published on Jun 3, 2019 6:24 pm IST

హీరో నితిన్‌కు 2017, 2018 అస్సలు కలిసిరాలేదు. ఆయన చేసిన మూడు చిత్రాలు ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఈసారి తప్పక హిట్ అందుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే కొంత గ్యాప్ తీసుకుని రెండు నమ్మకమైన ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు ఆయన. వాటిలో మొదటి సినిమా ‘ఛలో’తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వంకీ కుడుములు డైరెక్షన్లో రూపొందుతున్న ‘భీష్మ’. ఇందులో రష్మిక కథానాయిక. కాంబినేషన్ చూస్తే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది.

ఇక మరొక చిత్రం వెంకీ అట్లూరితో. మొదటి చిత్రం ‘తొలిప్రేమ’తోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు రెండో చిత్రం ‘మజ్ను’తో పర్వాలేదనిపించాడు. ఇతనితో ఒక సినిమాను సెట్ చేశారట నితిన్. దీనిపై అధికారిక కన్ఫర్మేషన్ ఇంకా అందలేదు. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్స్ చూస్తే నితిన్ దారిలోపడి మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారనే అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More