నితిన్ ఇంకో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడా ?

Published on Jun 16, 2021 3:01 am IST

నితిన్ గత సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా చకా చకా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. నితిన్ ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ చిత్రం చేస్తున్నారు. ఇంకొద్దిరోజుల్లో ఈ సినిమా పూర్తికానుంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైతే ఈ 2021లో నితిన్ నుండి మూడు సినిమాలు వచ్చినట్టు. ఈ సినిమా పూర్తయ్యేలోపే వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు నితిన్. ఇది కాకుండా ఇంకొక కొత్త చిత్రాన్ని కూడ నితిన్ లైన్లో పెడుతున్నట్టు టాక్.

‘బిజినెస్ మ్యాన్, టెంపర్’ లాంటి చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారట. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన నితిన్ కు ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది నచ్చడంతో నితిన్ సినిమా చేయడానికి సుముఖంగా ఉన్నారని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే వక్కంతం వంశీ సినిమా తర్వాత వీరి చిత్రమే ఉండొచ్చట. ‘మాస్ట్రో’ చిత్రానికి కూడ ఎస్ఆర్ శేఖరే ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :