నితిన్ సరసన టాలీవుడ్ గోల్డెన్ గర్ల్

నితిన్ సరసన టాలీవుడ్ గోల్డెన్ గర్ల్

Published on Apr 29, 2015 10:05 AM IST

nithin-rakul-preeti

‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత మేకప్ వేసుకోవడానికి కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తను నిర్మాతగా వ్యవహరిస్తున్న అఖిల్ – వివి వినాయక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నితిన్ దగ్గరుండి మరీ అన్ని ప్రొడక్షన్ కార్యక్రమాలను చూసుకుంటున్నాడు. ఇది పక్కన పెడితే తన తదుపరి సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నితిన్ మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టొరీ లైన్ కి ఓకే చెప్పారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో నితిన్ కి జోడీగా వరుస విజయాలను అందుకొని టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. నితిన్ – శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ మొదలయ్యి ఆగిపోయింది. అప్పట్లో ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ సినిమా ఆగిపోయింది, అలా అని వారు రకుల్ ప్రీత్ ని అడ్వాన్స్ తిరిగి ఇమ్మని అడగలేదు. అందువలన ఇప్పుడు నితిన్ – వేణు సినిమాలో తననే హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ నితిన్ సినిమాకి నో అనకుండా డేట్స్ అడ్జస్ట్ చేస్తుందేమో చూడాలి. నితిన్ అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి జూన్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది.

తాజా వార్తలు