నితిన్ కొత్త సినిమా టైటిల్ రేపే

Published on Mar 29, 2021 8:33 pm IST

హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో నితిన్ హీరోగా చేస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ రేపు మంగళవారం 2 గంటలకు రివీల్ చేయనున్నారు. ఇందులో నితిన్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే మొదలైన చిత్రీకరణ 40 శాతం వరకు పూర్తయింది. ఇందులో కథానాయకిగా నభా నటేష్ నటిస్తుండగా ప్రధానమైన నెగెటివ్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషిస్తోంది. ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. నితిన్ కెరీర్లో ఇదే పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇటీవల నితిన్ నుండి వచ్చిన ‘చెక్’ ఫ్లాప్ కాగా ‘రంగ్ దే’ జస్ట్ ఓకే అనిపించుకుంది. దీంతో ఈ సినిమా మీదే నితిన్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ప్రేక్షకులు సైతం నితిన్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :