తెలుగు రాష్ట్రాలలో వసూళ్ల దుమ్ముదులిపిన భీష్మ

Published on Feb 22, 2020 10:13 am IST

దాదాపు ఏడాదిన్నర విరామం తరువాత హీరో నితిన్ భీష్మ చిత్రంతో థియేటర్స్ లో దిగారు. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటిరోజు రికార్డ్ కలెక్టన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో భీష్మ వసూళ్ల జోరు చూపించింది. మొత్తంగా ఏపీ మరియు తెలంగాణాలలో కలిపి 6.4 కోట్ల షేర్ రాబట్టింది. నితిన్ నటించిన ‘ఆ అ..’మూవీ తరువాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా భీష్మ నిలిచింది. ఇక కృష్ణ డిస్ట్రిక్ట్ లో 40.36 లక్ష షేర్, వైజాగ్ లో 62 లక్షల షేర్ తో రెండు చోట్ల కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో 2.21 కోట్ల షేర్ రాబట్టింది. పాజిటివ్ టాక్ రీత్యా భీష్మ వసూళ్లు నేడు మరియు రేపు మరింత పెరిగే అవకాశం కలదు.

దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More