అద్భుతమైన కథతో మూడు భాగాలుగా.. !

Published on Mar 31, 2019 6:50 pm IST

నితిన్ ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మా’లో, అలాగే చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాతో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా తాజా సమాచారం ప్రకారం కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న చిత్రం, మొత్తం మూడు భాగాలుగా రాబోతుందట. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ బ్యానర్ పై ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కృష్ణ చైతన్య రాసిన ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని.. అందుకే నితిన్ ఈ సినిమా పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం :

More