నితిన్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ !
Published on Nov 28, 2017 10:18 am IST

లై సినిమా తరువాత నితిన్ చెయ్యబోతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రౌడీఫెలో ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మేఘా ఆకాష్ నితిన్ కు జోడిగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా నితిన్ & తమన్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు తమన్. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. నితిన్ తాజాగా దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేష్ణ దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook