
వరుస హిట్లతో జోరు మీదున్న హీరో నితిన్ మరోవారం రోజుల్లో ‘కొరియర్ బాయ్’ కళ్యాణ్గా మనల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా, ఎప్పుడో పూర్తైనా కొన్ని ఆర్థిక సమస్యలతో ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. గౌతమ్ మీనన్ శిష్యుడు ప్రేమ్ సాయి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సెప్టెంబర్ 11న పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది.
ఒక సరికొత్త కథతో, ఆసక్తికర కథనంతో రూపొందిన ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో హీరో నితిన్ ఉన్నారు. కొతదనమున్న సినిమాలు కావాలి అని అడిగే వారికి ఈ సినిమా ఒక బెటర్ ఆప్షన్ అని నితిన్ చెబుతూ వస్తున్నారు. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. గౌతమ్ మీనన్ కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సినిమా ద్వారా తన ఖాతాలో మరో మంచి హిట్ వచ్చి చేరుతుందన్న నమ్మకంతో నితిన్ ఉన్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యామి గౌతమ్ హీరోయిన్గా నటించారు.

