రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ లో నితిన్ !

Published on Mar 21, 2019 11:08 pm IST

ప్లాప్ ల్లో ఉన్న నితిన్ కి ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి. ఆ సినిమాలకు ముందు వరకూ టాలీవుడ్ లో ప్లాప్ హీరోకి పర్యాయ పదంగా మారిపోయాడు నితిన్. ఎట్టకేలకూ ఆ ప్లాప్ ల వలయంలో నుంచి బయటపడి.. ‘అఆ’తో ఫుల్ సక్సెస్ లో ఉన్న టైంలో.. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’లాంటి ప్లాప్ లతో మళ్లీ డీలా పడ్డాడు. దాంతో తన తరువాత చిత్రాల పై మరింత ఫోకస్ పెట్టాడు నితిన్. అందుకే ఎప్పుడో మొదలు పెట్టాల్సిన ‘భీష్మ’ను పోస్ట్ పోనే చేసి.. స్క్రిప్ట్ పూర్తిగా నచ్చేలా చేయించుకుని.. వచ్చే నెలలో షూట్ కి వెళ్లనున్నారు.

అయితే ఇప్పుడు నితిన్ మరో కొత్త చిత్రానికి కూడా ఓకె చెప్పాడు. ‘వీర’ ఫేమ్ రమేష్‌ వర్మతో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఏ స్టూడియోస్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :

More