కరుణాకర్ దర్శకత్వంలో నితిన్ సినిమా

కరుణాకర్ దర్శకత్వంలో నితిన్ సినిమా

Published on Jun 2, 2014 7:47 PM IST

Nithin-and-Karunakaran
నితిన్ నటిస్తున్న తదుపరి సినిమా షూటింగ్ ఈరోజు మొదలయ్యింది. కరుణాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మిష్టి చక్రబోర్తి హీరోయిన్ గా నటిస్తుంది.

‘ఇష్క్’ ‘గుండె జారి గల్లంతయింది’ ‘హార్ట్ ఎటాక్’ సినిమాలతో మంచి క్రేజ్ తేచుకున్న నితిన్, ఈ సినిమాపై కూడా చాలా ఆశలు పెటుకున్నాడు. ఈ సినిమాలన్నీ ప్రేమ కథలు కావడం విశేషం. అయితే ‘తొలిప్రేమ’ వంటి అద్భుత ప్రేమ కథకు దర్శకత్వం వహించిన కరుణాకర్ ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తుండడంతో, ఈ సినిమా ఎలా తెరకేక్కబోతుందో అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు అవలేదు.

తాజా వార్తలు