స్క్రిప్ట్స్ పై జాగ్రత్త పెంచిన హీరో !

Published on Apr 26, 2019 4:00 pm IST

‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలు ప్లాప్ ల్లో ఉన్న నితిన్ ను సక్సెస్ బాట పటించాయి. ఆ సినిమాలకు ముందు వరకూ టాలీవుడ్ లో ప్లాప్ హీరోకి పర్యాయ పదంగా మారిపోయాడు నితిన్. ఎట్టకేలకూ ఆ ప్లాప్ ల వలయంలో నుంచి బయటపడి.. ‘అఆ’తో ఫుల్ సక్సెస్ లో ఉన్న టైంలో.. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’లాంటి ప్లాప్ లతో మళ్లీ డీలా పడ్డాడు.

దాంతో తన తరువాత చిత్రాల పై మరింత ఫోకస్ పెట్టాడు నితిన్. అందుకే ఎప్పుడో మొదలు పెట్టాల్సిన ‘భీష్మ’ను పోస్ట్ పోనే చేసి.. స్క్రిప్ట్ పూర్తిగా నచ్చేలా చేయించుకుంటున్నాడు. అలాగే కృష్ణ చైతన్య స్క్రిప్ట్ ను కూడా పూర్తిగా నచ్చాకే అంగీకరించాడట. మొత్తానికి స్క్రిప్ట్స్ విషయంలో నితిన్ బాగానే జాగ్రత్తగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :