‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో మెప్పించేందుకు సిద్ధమైన నితిన్

‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో మెప్పించేందుకు సిద్ధమైన నితిన్

Published on Sep 15, 2015 10:16 AM IST

Courier-Boy-Kalyan
వరుస హిట్స్‌తో జోరు మీదున్న నితిన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో రూపొందిన సినిమా అంటేనే ఆ సినిమాపై ఉండే క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్‌తోనే సెప్టెంబర్ 17న వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రేమ్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ఆడియో, ట్రైలర్‌లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక సినిమా కూడా సరికొత్త కథతో, అందరినీ మెప్పించే అంశాలతో ఉంటుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. గౌతమ్ మీనన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నితిన్ పర్ఫామెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని గౌతమ్ మీనన్ తెలిపారు. ఇక త్వరలోనే తన దర్శకత్వంలోనే నితిన్‌తో ఓ సినిమా చేయనున్నానని కూడా గౌతమ్ మీనన్ ఈ సందర్భంగా తెలపడం విశేషం. నితిన్ ఈ సినిమాలో ఓ సాధారణ నిరుద్యోగిగా కనిపిస్తూ, యూత్ ఐడెంటిఫై చేసుకునే పాత్రలో కనిపించనున్నారు. నితిన్ సరసన యామి గౌతమ్ హీరోయిన్‌గా నటించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు