అఖిల్ సరసన నితిన్ హీరోయిన్ ?

తాజాగా రెండు కొత్త సినిమాల్ని ప్రకటించారు యువ హీరో అఖిల్ అక్కినేని. వీటిలో వెంకీ అట్లూరి సినిమా కూడ ఒకటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి చేసిన మొదటి చిత్రం ‘తొలిప్రేమ’తోనే మంచి హిట్ అందుకుని ఉండటం వలన ఈ సినిమాపై కూడ అంచనాలు పెరిగాయి.

ఇకపోతే ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయకిగా నటిస్తుందని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే చిత్ర టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే. నితిన్ యొక్క ‘లై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాష్ నితిన్ యొక్క మరొక చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’లో కూడ నటించింది.