ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఆ హీరోయిన్ నే ఫిక్స్ చేశాడా ?

Published on Apr 30, 2019 9:16 am IST

బిగెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ అతి త్వరలో మొదలుకానుంది. ఇటీవల రామ్ చరణ్ , ఎన్టీఆర్ గాయపడడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకొని కొత్త షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఈ చిత్రం నుండి అనివార్యకారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకుందని తెలిసిందే. అప్పటినుండి ఈ చిత్రంలో ఆమె ప్లేస్ లో నటించే హీరోయిన్ ఈమె నంటూ పలువురు పేర్లు బయటికి వచ్చాయి.

అందులో ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ పేరు కూడా వుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు జోడిగా నిత్యానే తీసుకోవాలనుకుంటున్నాడట రాజమౌళి. పల్లెటూరి అమ్మయిగా నిత్య కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆమె వైపే మొగ్గు చూపుతున్నాడట. మరి త్వరలోనే ఈ హీరోయిన్ విషయంలో క్లారిటీ రానుంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుంది. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :