‘బీష్మ’ పై నితిన్ ఎక్సయిట్మెంట్ మామూలుగాలేదుగా…!

Published on Jun 20, 2019 2:14 pm IST

యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చారంట ఆ విషయాన్న స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నితిన్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో చేసిన “శ్రీనివాస కళ్యాణం” మూవీ గత సంవత్సరం ఆగస్టులో విడుదలైంది. తరువాత నితిన్ ఏ మూవీకి సైన్ చేసింది లేదు. కొద్దిరోజుల క్రితం వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందాన హీరోయిన్ గా “భీష్మ” అనే మూవీ పూజాకార్యక్రమం హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు మొదలు కావడంతో ఆ ఎక్సయిటింగ్ ఫీలింగ్ ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు నితిన్. “ఓ నూతన దినాన,ఓ కొత్త లుక్ లో ,ఓ కొత్త పాత్ర కోసం దాదాపు సంవత్సరం తరువాత కెమెరా ముందుకు వచ్చాను. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది,భీష్మ షూటింగ్ బిగిన్స్” అంటూ ట్వీట్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More