క్రియేటీవ్ డైరెక్ట‌ర్స్‌తో జ‌త‌క‌ట్టిన‌ నితిన్.. ఈసారి అయినా ఫేట్ మారేనా..?

Published on Oct 29, 2018 9:09 am IST

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. అ..ఆ చిత్రంతో యాభై కోట్ల క్ల‌బ్‌లో చేరిన నితిన్ ఆ త‌ర్వాత న‌టించిన లై, ఛ‌ల్ మోహ‌న్ రంగా, శ్రీనివాస‌క‌ళ్యాణం చిత్రాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో… నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడు. ఈ నేప‌ధ్యంలో నాగ‌శౌర్య‌-రష్మిక మందాన జంట‌గా తెర‌కెక్కిన ఛ‌లో చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నితిన్.

సితారా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ రెండో వారంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మ‌రి వ‌రుస ప‌రాజ‌యాల‌తో రేసులో వెనుక‌బ‌డిపోయిన నితిన్‌కి ఈ చిత్రం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంతో పాటు క్రియేటీవ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ మ‌రో చిత్రానికి కూడా సైన్ చేశాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్స్ ద‌శ‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్.. వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను సెట్ చేసుకున్న నితిన్ ఫేట్‌ని ఈ రెండు చిత్రాలు ఎంత‌వ‌రకు మారుస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :