కరోనాతో పెళ్లి ఆగింది శాటిలైట్ డీల్ ఆగిపోయింది !

Published on Apr 2, 2020 10:00 pm IST

హీరో నితిన్ ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని ఎట్టకేలకూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ హిట్ ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమా ‘రంగ్ దే’ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల అయి సినిమా పై అంచనాలు పెంచేశాయి.

అయితే ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ కు కలిపి జీ టీవీ నుంచి పది కోట్ల వరకు ఆఫర్ వచ్చిందట. కానీ నిర్మాత నాగవంశీ 12 కోట్లు కావాలనడం.. ఇక 11 కోట్లకు సెట్ అయ్యేది అట. అంతలో కరోనా రావడం.. సినిమా పనులు వాయిదా పడటం, రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉండటంతో శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ డీల్ కు ప్రస్తుతానికి బ్రేక్ పడిపోయిందట. మొత్తానికి కరోనా నితిన్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. కరోనా కారణంగా పెళ్లి పోస్ట్ ఫోన్ అయింది, ఇప్పుడు సినిమా శాటిలైట్ డీల్ కూడా ఆగిపోయింది.

ఇక ఈ చిత్రం పూర్తిస్థాయి ప్రేమ కథగా ఉండనుంది. ఇందులో నితిన్ సరసన స్టార్ నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More