సర్టిఫైడ్‌ కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న హీరోయిన్..!

Published on Jul 14, 2021 1:39 am IST

సినీ నటులు కేవలం సినిమాలపైనే కాకుండా అప్పుడప్పుడు తమకిష్టమైన కలలను నెరవేర్చుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చిత్రలహరి, అల వైకుంఠపురములో, రెడ్ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి నివేదా పేతురాజు సర్టిఫైడ్‌ కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటుందట. ఇందులో భాగంగానే ఫార్ములా రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో లెవల్1 లో సర్టిఫికేట్ పొందినట్టు వెల్లడించింది.

అయితే మెమొంటమ్‌ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుంచి నివేదా ఈ సర్టిఫికేట్‌ను పొందింది. దీనికి సంబధించిన ఫోటోలు, వీడియోలను నివేదా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నివేదా విశ్వక్‌సేన్‌కు జోడీగా ‘పాగల్‌’ చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :