నివేదా థామస్ క్యారెక్టర్ చాలా కొత్తగా.. !

నివేదా థామస్ క్యారెక్టర్ చాలా కొత్తగా.. !

Published on Apr 5, 2019 4:50 PM IST

శ్రీ విష్ణు హీరోగా సరసన నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది ఈ చిత్రం. కాగా క్రైమ్ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుందని.. సినిమాలోని నివేదా థామస్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. నివేదా ఎపిసోడ్ సినిమాలో ప్లాష్ బ్యాక్ లో వస్తోందట.

ఈ సినిమాలో నివేదా థామస్ క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తుంది. ఇక ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని కూడా బాగా తెరకెక్కిస్తున్నడాట. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం క్రీయేషన్స్ పతాకం ఫై మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు