దర్బార్ లోకి చెన్నై బ్యూటీ !

Published on Apr 25, 2019 9:06 am IST

ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తునం చిత్రం దర్బార్. ప్రస్తుతం ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది. ఇటీవల ఈ షెడ్యూల్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార జాయిన్ అయింది. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ నివేతా థామస్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారు.

బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ విలన్ గా నటిస్తున్నా ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :