పవన్ ఫ్యాన్స్ కి నివేతా థామస్ స్పెషల్ మెసేజ్.!

Published on Apr 4, 2021 3:09 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ శిల్ప కళావేదిక లో గ్రాండ్ గా జరగనున్నాయి. మరి ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్ నివేతా థామస్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

కానీ అనుకోని విధంగా ఆమెకు కరోనా పాజిటివ్ రావడం బాధాకరంగా మారింది. మరి ఇప్పుడు ఆమె రాలేకపోతుందన్న సంగతి తెలిసిందే. అందుకే నివేతా పవన్ ఫ్యాన్స్ కు మరియు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఓ స్పెషల్ మెసేజ్ ను ఇచ్చింది. “ఈ రోజు అందరినీ కలవాలని చాలా ఎదురు చూశానని కానీ ప్రతీ ఒక్కరు కరోనాను దృష్టిలో ఉంచుకొని మాస్కులు మాత్రం తియ్యొద్దని దూరం పాటిస్తూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నాని” నివేతా స్పెషల్ గా తెలిపింది.

సంబంధిత సమాచారం :