నిత్యా మీనన్ అమ్మగా కనిపించనుందా…!

Published on Aug 8, 2019 11:07 pm IST

క్యూటీ నిత్యా మీనన్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం “మిషన్ మంగళ్”. అక్షయ్ కుమార్ హీరోగా డైరెక్టర్ జగన్ శక్తి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మార్స్ గ్రయంపై ప్రయోగించిన మంగళ్ యాన్ సక్సెస్ స్టోరీ ఆధారంగా రూపొందుతుంది. మంగళ్ యాన్ మిషన్ హెడ్ గా పనిచేసిన రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ నటిస్తుండగా,ఈ ప్రాజెక్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఐదుగురు లేడీ స్పేస్ సైంటిస్ట్ ల పాత్రలలో విద్యా బాలన్, తాప్సి పన్ను,నిత్యా మీనన్,సోనాక్షి సిన్హా,కీర్తి కొల్హారి నటిస్తున్నారు.

కాగా వీరిలో నిత్యా మీనన్ ఆ ఐదుగురు స్పేస్ సైంటిస్ట్ లలో ఒకరైన వర్షా గౌడ్ పాత్రను చేస్తున్నారు. వర్షా గౌడ్ గృహిణి కావడంతో పాటు, పిల్లలుకూడా ఉండటంతో నిత్యా పిల్లల తల్లిగా కనిపించనున్నారు. తల్లిగా,సైంటిస్ట్ గా వ్యక్తిగత జీవితాన్ని,వృత్తిని చక్కగా బ్యాలన్స్ చేసే మహిళగా నిత్యా పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. నేడు ఆమె పాత్రను స్వభావాన్ని రివీల్ చేసే విధంగా ఉన్న ఓ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్ లో నిత్యను, సైంటిస్ట్ గా,వైఫ్ గా రెండు వేరియేషన్స్ లో చూపించారు. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :