తన పెళ్లి గురించి స్పందించిన నగ్మా !

Published on Mar 3, 2019 6:21 pm IST

ఇరవై ఏళ్ల క్రితం సౌత్ సినీ ఇండస్ట్రీస్ ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ లిస్ట్ లో హాట్ హీరోయిన్ నగ్మా పేరు ముందు వరుసలో ఉంటుంది. సౌత్ టాప్ హీరోలందరితోనూ జతకట్టిన నగ్మా, కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గేసరికి సరికి రాజకీయాల్లోకి కూడా వెళ్ళింది ఈ మాజీ హీరోయిన్. అయితే వయసు పై బడి పదుల సంవత్సరాలు గడిచిపోయినా.. నగ్మా ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు.

కాగా తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగ్మా తన పెళ్లి విషయం గురించి స్పందిస్తూ.. ‘‘జీవితంలో పెళ్లి అనేది దేవుడు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. జీవితంలో పెళ్లితో పాటు మిగిలిన అన్ని విషయాలు కూడా దేవుడు రాసిన విధంగానే జరుగుతాయి అని నమ్ముతాను నేను. ఇంక నా పెళ్లి గురించి నేను డిసైడ్‌ చేయాల్సింది ఏముంది. అయితే పెళ్లికి నేను వ్యతిరేకం కాదు’’ అని నగ్మా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

More