మహానటుడి చిత్రంలో ఆ హీరో నటించట్లేదట ?

Published on Jul 29, 2018 6:20 pm IST

ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టకముందు నుంచే ఆ చిత్రానికి సంబంధించి ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నప్పటికీ సినిమాలోని కొన్ని ముఖ్యమైన పాత్రలు ఇంకా ఫైనల్ కాలేదు. అందులో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్ర. నాగేశ్వరరావుగారి పెద్ద మనవడు హీరో సుమంత్ నాగేశ్వరరావుగారి పాత్రలో నటించన్నట్లుగా గతంలోనే విస్తృతంగా వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సుమంత్ ఆ పాత్రను పోషించట్లేదని తెలుస్తోంది.

ఇప్పుడు ఏఎన్నార్ పాత్రను పోషించే నటుడు కోసం చిత్రబృందం చూస్తుందట. అయితే సుమంత్ నే మరోసారి సంప్రదించాలని దర్శకనిర్మాతలు భావిస్తోన్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా బాలకృష్ణే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :