
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఈ పేరుకి ఒక స్టార్ హీరోగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ఇరు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ని ఆరాధించే అభిమానులు కోకొల్లలు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. హీరోగానే కాకుండా తన రాజకీయ పార్టీ ‘జనసేన పార్టీ’ తరపున కూడా ఆయన ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాయకంగా మారాడు. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా, సామాన్య మానవుడిగా ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఎలాంటి వేడుకనైనా పెద్ద పెద్ద ఆర్భాటాలు, గ్రాండ్ ఫంక్షన్స్ లాంటివి లేకుండా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడతాడు.
రేపు సెప్టెంబర్ 2 అనగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రతి బర్త్ డేని చాలా సింపుల్ గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజుచేసుకుంటాడు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ అందరికీ దూరంగా సింపుల్ గా తన పుట్టిన రోజుని గడపనున్నాడు. అందులో భాగంగానే తను ఇక్కడే ఉంటే అభిమానులు, తెలిసిన వారు సెలబ్రేట్ చెయ్యడానికి ట్రై చేస్తారని పవన్ అవుట్ అఫ్ స్టేషన్ వెళ్ళిపోయాడు. అక్కడే రెండు రోజులు గడిపి తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరిగి రానున్నాడు. వచ్చాక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ న్యూ షెడ్యూల్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ సింప్లిసిటీ అభిమానుల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని మరింత పెంచింది. పవన్ కళ్యాన్ దూరంగా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం రేపు ఇరు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కోసం రంగం సిద్దం చేసారు.

