“రాధే శ్యామ్” ప్లానింగ్ లో ఎలాంటి చేంజ్ లేదా.?

Published on May 15, 2021 8:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” అనే భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఎప్పుడో షూట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం మళ్ళీ కొన్ని రీషూట్స్ నిమిత్తం మళ్ళీ షూట్ స్టార్ట్ చెయ్యాల్సి వచ్చింది.

కానీ అంతకు ముందే ఈ చిత్రం తాలూకా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేసేసారు. కానీ మళ్ళీ ఒక్కసారిగా పరిస్థితులు మారడంతో అనుకున్న సమయాన్ని దాటుతుందేమో అన్న అనుమానం కూడా మొదలయ్యింది. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ముందు అనుకున్న జూలై డేట్ కే స్టిక్ అయ్యి ఉన్నారని టాక్. అప్పటికి పరిస్థితులు సెట్ అయితే అనుకున్న సమయానికే రాధే శ్యామ్ ఫీస్ట్ రావచ్చని నయా బజ్. మరి అప్పటికి టైం ఎలా సెట్టవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :