సుధీర్ బాబు నెక్స్ట్ సినిమా ఫై క్లారిటీ లేదు !

Published on Feb 5, 2019 2:41 pm IST

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చాడు యంగ్ హీరో సుధీర్ బాబు. అందులో ‘సమ్మోహనం’ హిట్ అవ్వగా ‘నన్ను దోచుకుందువటే’ బాగుంది అన్న టాక్ తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. పైగా ఈ చిత్రాన్ని స్వయంగా సుధీర్ బాబే నిర్మించాడు.

ఇక ఈ చిత్రం తరువాత పులి వాసు దర్శకత్వంలో సుధీర్ బాబు తన 11 వ చిత్రంలో నటించాల్సి వుంది. మెహ్రీన్ ను కథానాయికగా ఎంపిక చేశారు. పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం అనివార్యకారణాలతో ఆగిపోయింది. అయితే సుధీర్ బాబు ఇటీవల ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించనున్నాని ప్రకటించాడు. ఇక ఈచిత్రానికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని టాక్. దాంతో ఈ చిత్రం మొదలవ్వడానికి చాలా సమయం పట్టేలా వుంది. ఇలోగ సుధీర్ బాబు మరో చిత్రాన్ని స్టార్ట్ చేస్తాడో లేక ఈ బయోపిక్ కోసం వెయిట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :