చరణ్ నెక్స్ట్ పై క్లారిటీ లేని ఈ ఫ్యాక్టర్.!

Published on Jun 24, 2021 7:01 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ మల్టీ స్టార్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇంకా షూట్ స్టార్ట్ కావడానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం క్యాస్ట్ మరియు టెక్నీకల్ టీం పై కూడా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మరి అలా ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారు అన్నది క్లారిటీ లేని ఫ్యాక్టర్ గా మారింది. అయితే ఎక్కువగా అనిరుద్ మరియు థమన్ పేర్లు ఈ చిత్రానికి వినిపిస్తుండగా మోస్ట్లీ మాత్రం థమన్ పేరే ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి థమన్ ఫిక్సే అని మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు. మరి ఆ భారీ కాంబినేషన్ ను మ్యాచ్ చెయ్యగలిగే ఏ సంగీత దర్శకున్ని శంకర్ పట్టుకుంటారో అన్నది ప్రస్తుతానికి ఆసక్తికరంగానే కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం :