‘ఓజి 2’ ఫిక్స్ ఓకే.. మరి ఆ విషయం పై క్లారిటీ ఎప్పుడు..?

‘ఓజి 2’ ఫిక్స్ ఓకే.. మరి ఆ విషయం పై క్లారిటీ ఎప్పుడు..?

Published on Jun 20, 2026 9:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోమ్ బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఇటీవల ‘ఓజీ 2’ పై ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న డైరెక్టర్ సుజిత్.. ఇండియాకు తిరిగి రాగానే పవన్‌తో భేటీ కానున్నారు. ఈ మీటింగ్‌లోనే స్క్రిప్ట్, బడ్జెట్, రెమ్యునరేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

​అయితే, మొదటి భాగాన్ని నిర్మించిన డి.వి.వి. దానయ్య సీక్వెల్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కానుంది. దీనికోసం టాలీవుడ్‌కి చెందిన ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో చేతులు కలపాలని ప్లాన్ చేస్తున్నాడు.

​ప్రస్తుతం సుజిత్ ‘యువీ క్రియేషన్స్’తో కూడా చర్చలు జరుపుతున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్‌కు కమిట్‌మెంట్స్ ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ లేదా రామ్ తాళ్లూరిలలో ఎవరో ఒకరు ‘ఓజీ 2’ ప్రొడక్షన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రేజీ సీక్వెల్ ప్రొడ్యూసర్‌పై రాబోయే రెండు నెలల్లో పూర్తి క్లారిటీ రానుంది.

తాజా వార్తలు