ప్లాన్ ప్రకారమే జరుగనున్న ‘సాహో’ షూటింగ్ !
Published on Feb 27, 2018 10:48 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత చేస్తున్న చిత్రం ‘సాహో’. ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల్ని, ప్రభాస్ మార్కెట్ స్థాయిని అందుకునేలా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ పెద్ద మొత్తంలో బడ్జెట్ ను ఖర్చు చేస్తూ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో కొంత చిత్రీకరణ జరగ్గా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దుబాయ్ లో ప్లాన్ చేశారు యూనిట్.

ఇప్పటికే సగం క్రూ సభ్యులు దుబాయ్ వెళ్లగా మిగిలినవారు కూడ త్వరలోనే అక్కడికి చేరుకోనున్నారు. మార్చి 3వ వారం నుండి ఈ చిత్రీకరణ మొదలవుతుంది. చిత్రంలోనే అత్యంత ఎక్కువ ఖర్చుతో రూపొందనున్న షెడ్యూల్ ఇదే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 
Like us on Facebook