“అఖండ” రిలీజ్ పై డౌటే లేదా..వచ్చేది అప్పుడే.!

Published on Jul 16, 2021 8:01 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”.బాలయ్య హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రస్తుతం సాలిడ్ క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం ఎప్పుడెపుడు విడుదల అవుతుందా అని అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే కాస్త క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది.

అక్టోబర్ నెల నాటికి పరిస్థితులు బానే ఉంటే భారీ చిత్రం “RRR” రెడీగా ఉంది కానీ ఆ సమయానికి మిగతా సినిమాలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు తక్కువే.. అందుకే బాలయ్య మాత్రం ముందు అనుకున్న సమయానికే సెప్టెంబర్ నెలలోనే ఎంటర్ కానున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్య అఖండ వస్తే వినాయక చవితి సందర్భంగానే రానుండడం ఫిక్స్ అయ్యిందని టాక్. సో ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :