కార్తి ‘ఖైదీ’ లో హీరోయిన్ లేదట !

Published on May 10, 2019 12:59 pm IST

తమిళ హీరో కార్తి ‘మానగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ . ఈ చిత్రం యొక్క షూటింగ్ నిన్నటితో కంప్లీట్ అయ్యింది. ఇక అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదట. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం కార్తి ప్రస్తుతం దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ‘రెమో’ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో ఓ సినిమా చేయనున్నాడు కార్తి. ఈ సినిమాలో కార్తి కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక నటించనుంది. ఈ సినిమా తో ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

సంబంధిత సమాచారం :

More