96 తెలుగు రీమేక్ గురించి వచ్చిన రూమర్ల ఫై క్లారిటీ ఇచ్చిన టీం !

Published on Feb 27, 2019 9:45 am IST

గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన కోలీవుడ్ మూవీ 96 ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు దిల్ రాజు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ కే ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. శర్వానంద్, సమంత ను హీరో హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇక అంతా ఒకే అనుకున్న సమయంలో సంగీత దర్శకుడి విషయంలో దిల్ రాజు , ప్రేమ్ కుమార్ కు నిర్ణయాన్ని వ్యతిరేకించాడని గోవింద్ వసంత ప్లేస్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలని ఆయన పట్టుబట్టాడని అందుకు డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశాడని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా ఆ వార్తలపై చిత్ర టీం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని గోవింద్ ఆల్రెడీ కొని మంచి ట్యూన్స్ ఇచ్చాడని మ్యూజిక్ డైరెక్టర్ గా అతనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చింది. అలాగే శర్వా , సమంత చిన్నప్పటి పాత్రలకు కూడా టీన్ యాక్టర్స్ ను ఎంపిక చేశారని సమాచారం. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుండగా ఆగస్టు లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :