పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘స్పిరిట్’ ప్రస్తుతం టాలీవుడ్లోనే అత్యంత చర్చనీయాంశమైన ప్రాజెక్ట్‌గా మారింది. హార్డ్ అండ్ బోల్డ్ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ టీమ్‌కు న్యూ ఇయర్ బ్రేక్ ఉండదని తెలుస్తోంది. నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్, జనవరి తొలి వారం వరకు నిరంతరంగా కొనసాగనుంది. ముందుగా అనుకున్న న్యూ ఇయర్ సెలవులను పూర్తిగా రద్దు చేసినట్లు ఓ వర్గం వెల్లడించింది. షెడ్యూల్స్ కొంత వెనక్కి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లడం వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో, ఆ గ్యాప్‌ను కవర్ చేసేందుకు సందీప్ వంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణ కొరియా స్టార్ డాన్ లీ కూడా ‘స్పిరిట్’లో భాగమవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.


