దారుణం అక్టోబర్ వరకు కెజిఫ్ 2 పై నో అప్డేట్

దారుణం అక్టోబర్ వరకు కెజిఫ్ 2 పై నో అప్డేట్

Published on Apr 19, 2020 3:00 AM IST

KGF 1

సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాలలో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రం కెజెఫ్2. 2018లో వచ్చిన కెజిఫ్ భారీ విజయం అందుకోవడంతో దానికి కొనసాగింపుగా కెజిఫ్ 2 తెరక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. గత చిత్రానికి మించి ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కెజిఫ్ 2 లో ప్రధాన విలన్ అధీరా పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ చేస్తుండగా, రవీనా టాండన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.

ఐతే ఈ మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కెజిఫ్ సినిమా విడుదలకు చాల సమయం ఉన్న నేపథ్యంలో కెజిఫ్ టీజర్ చూడాలని ఆశపడుతున్నారు. కాగా ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ కెజిఫ్ నిర్మాతలు టీజర్ ఉండదని చెప్పడం జరిగింది. ఒకే సారి మూవీ విడుదలకు ముందు అక్టోబర్ లో ట్రైలర్ విడుదల చేస్తారట. యష్ హీరోగా తెరక్కుతున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు