ఆ సినిమా వార్తలో నిజం లేదు !
Published on Mar 10, 2018 10:02 am IST

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో పవన్ కళ్యాణ్ ఒక మూవీ చెయ్యాలి. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వార్తలు వచ్చాయి. తమిళ్ లో విజయం సాధించిన తెరి సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ కొంతకాలం పాటు ఈ సబ్జెక్టు పై వర్క్ చేసాడు, కాని పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంవల్ల సినిమా మొదలు కాలేదు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్తా బయటికి వచ్చింది, అదేంటంటే.. పవన్, సంతోష్ శ్రీనివాస్ సినిమా చెయ్యబోతున్నారని, త్వరలో వీరి ప్రాజెక్ట్ మొదలుకానుందని న్యూస్ 1 బయటికి వచ్చింది. కాని ఆ వార్తలో నిజం లేదని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి ఫోకస్ రాజకీయాలపై పెట్టాడని, 2019 ఎన్నికలు పూర్తి అయ్యే వరుకు సినిమాలు చెయ్యడాని తెలుస్తోంది.

 
Like us on Facebook