“బిగ్ బాస్ 5” పై ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదు.!

Published on Aug 28, 2021 1:00 pm IST


ప్రపంచ వ్యాప్తంగా కూడా అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని తెలిసిందే. ఇదే షో మన దేశంలో కూడా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. అయితే తెలుగులో షో అయితే ఇండియాలోనే అత్యధిక రేటింగ్స్ తో కొనసాగుతుంది.

మరి ఇప్పటి వరకు నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ సీజన్ కి సన్నద్ధం అయ్యింది. ఇంకొన్ని రోజుల్లో షో స్టార్ట్ అవుతుంది అనగా ఊహించని విధంగా కంటెస్టెంట్స్ లో కొందరికి కరోనా వచ్చి ఊహించని షాక్ తగిలింది అని కొన్ని వార్తలు జోరుగా స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే అంతర్గత సమాచారం అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే అని ఎవరికీ కరోనా సోకలేదని కన్ఫర్మ్ అయ్యింది. షో ప్లాన్ ప్రకారమే నడుస్తుందని కూడా సమాచారం. మరి ఈ సారి సీజన్ ని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :