పవన్ పై ఆ వార్తల్లో నిజం లేదా?

పవన్ పై ఆ వార్తల్లో నిజం లేదా?

Published on Feb 28, 2024 12:15 PM IST

og pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలు అన్నిటికి పవన్ కాస్త విరామం ఇచ్చి తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే లేటెస్ట్ గా పవన్ కొన్ని సినిమాలు సంబంధించిన వార్తలతో పాటుగా మరో వార్త విస్తృతంగా వైరల్ గా మారింది. పవన్ తన రాజకీయ పార్టీ కోసం తన ఆస్తులు అమ్ముతున్నాడు అని కొని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పవన్ ఫ్యాన్ హ్యాండిల్స్ కూడా వాటిని ప్రచారం చేసాయి.

అయితే అసలు పవన్ ఇలా చేస్తున్నాడు అనేందుకు ఒక్క సోషల్ మీడియాలో తప్ప మరెక్కడా కూడా టాక్ రాలేదు కనీసం పవన్ పి ఆర్ టీం నుంచి కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈరోజు అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. మరి దీనితో అసలు పవన్ నిజంగానే తన రాజకీయ పార్టీ కోసం తన ప్రాపర్టీస్ అమ్ముతున్నాడా అనే దానిలో ఎలాంటి అధికారిక వార్త లేదు. దీనితో వీటిలో ప్రస్తుతానికి నిజం లేదనే అనుకోవాలి.

తాజా వార్తలు